◆తడి చెత్త,పొడి చెత్త సేకరణ తో
వ్యవసాయం అభివృద్ధి-వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు
నేటి గద్దర్ హుకుంపేట న్యూస్:
అల్లూరి జిల్లా హుకుంపేట మండల పరిషత్ కార్యాలయంలో హుకుంపేట ఎంపీపీ కూడ రాజు బాబు,వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, ఎంపీ డిఓ రోణాంకి వెంకట రావు ల ఆధ్వర్యంలో డస్ట్ బిన్ ల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఎంపీపీ కూడ రాజు బాబు మాట్లాడుతూ…33 పంచాయితీ ల కు ప్రతీ ఇంటికి డస్ట్ బిన్ లను అందజేస్తున్నామని,ప్రతీ ఒక్కరూ బాధ్యత గా తడి ,పొడి చెత్త సేకరించి, మెరుగైన పారిశుధ్యం పాటించడం ద్వారా నే గ్రామంలో నీ ప్రజలందరూ ఆరోగ్యం గా ఉంటామన్నారు.
వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు మాట్లాడుతూ… ప్లాస్టిక్ వ్యర్థాలు మినహా,తడి,పొడి చెత్త తో,కంపోస్టు ఎరువు తయారీ ద్వారా
వ్యవసాయం అభివృద్ధి చెందుతుందన్నారు.
ఎంపీడీఓ ఆర్ వెంకట రావు మాట్లాడుతూ
పంచాయితీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,ప్రజాప్రతినిధులు,
సెక్రెటరీ లు,మెరుగైన పారిశుధ్యం కోసం అవగాహన కల్పించాలని, తద్వారా సీజనల్ గా వచ్చే,మలేరియా, డయోరియావంటి వ్యాధులు దరి చేరవన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ,ఎంపీటీసీ సాంబే బాలకృష్ణ,
పంచాయితీ సర్పంచ్ లు రేగం రమేష్,పీ రంజిత్ కుమార్
,డీడీ ఓ లు,పంచాయితీ సెక్రెటరీ లు,క్లాప్ మిత్రాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.