★దార్శనికుడు,భగీరథుడు కేసిఆర్ కల సాకారం అయింది.
★ ప్రభుత్వ మాజీ విప్ , పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
దార్శనికుడు , అపర భగీరథుడు కేసిఆర్ కల సాకారం అయింది అని ప్రభుత్వ మాజీ విప్ , పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ విజయవంతం కావడం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు శుభ సూచకం అన్నారు.
గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించిన గొప్ప నాయకుడు కేసిఆర్ అని అన్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ విజయవంతమైనందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులకు, ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు.
సీతారామ ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ సంకల్పిస్తే …కాంగ్రెస్ నాయకులు నాడు అనేక కేసులు వేసి ఆటంకం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర తో పోరాడి సీతారామ కు అన్ని అనుమతులు మంజూరు చేయించి , 90 శాతం పనులు పూర్తి చేయించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు.
కెసిఆర్ హయాంలోనే మొదటిసారి డ్రై రన్ కూడా నిర్వహించాం.
సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బ్యారేజ్ సహా మొత్తం పంపు హౌస్ లు పని పూర్తి అయినది..
లింక్ కెనాల్ ను పూర్తిచేసి, ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగించుకుంటే ఆరు లక్షల డెబ్బై అయిదు వేల పైచులకు ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు.
కెసిఆర్ ఆలోచనే తెలంగాణ రైతాంగానికి శ్రీరామరక్ష.
ఒకపక్క కాళేశ్వరం నిర్మిస్తూనే, ఇటువైపు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన ఘనత కేసిఆర్ ది. ప్రాజెక్టు ఆగిపోవాలని కాంగ్రెస్ కార్యకర్త తెల్లం . నరేష్ తో కోర్టులో కేసు వేపించింది స్వయానా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొదెం . వీరయ్య . జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు పర్యటనకు వచ్చి ప్రజలకు ఒనగూరింది ఏమిలేదు. తట్టెడు మట్టిపోయలేదు. దమ్ముంటే సీతారామ ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు చేశారో ప్రజల కు చెప్పాలన్నారు. పైసా ఖర్చుపెట్టకుండా స్విచ్ ఆన్ చేసి తుమ్మల.. నా కళ నెరవేరింది అని చిలక పలుకులు పలకడం హాస్యాస్పదం అన్నారు. మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ముద్దాడినట్లు ఉంది మంత్రి తుమ్మల వ్యవహారం. దమ్ముంటే ప్రాజెక్టు పూర్తిచేయండి అని జిల్లా ప్రజల పక్షాన రేగా కాంతారావు డిమాండ్ చేశారు.