నేటి గదర్ న్యూస్,మణుగూరు:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మణుగూరు ఏరియా జిఎం కార్యాలయంలో ఆఫీస్ డిప్యూటీ సూపర్డెంట్ గా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన కంచర్ల శైలజ ను శుక్రవారం నాడు జిఎం కార్యాలయం లో ఏరియా కార్మిక సంఘాల నాయకులు శాలువా పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగినిగా తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేరుస్తూనే సామాజిక కార్యక్రమాలలో తమ వంతు సహకారాన్ని అందించారని ఈ సందర్భంగా నాయకులు ఆమె సేవలను కొనియాడారు, ఆమె విశ్రాంతి జీవితం ఆనందమయం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి ఏరియా ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు, ఏఐటీయూసీ నాయకులు ఏ సురేందర్, సిఐటియు నాయకులు వి వెంకటరత్నం, ఐ ఎఫ్ టి యు నాయకులు నా సర్ పాషా, మరియు బోళ్ళ కుమారస్వామి, సంతోష్ చరణ్, ఏ రాజశేఖర్, ఎం నరసింహారావు ఎస్ శరత్ తదితరులు పాల్గొన్నారు.