◆కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీలోనీ ప్రాథమిక విద్యారంగాన్ని కాపాడాలి
◆చర్లలో రెగ్యులర్ MEO ని నియమించాలి
◆MP బలరాం నాయక్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
◆CPIML మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండా చరణ్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి/చర్ల:
చర్ల మండలం కేంద్రంలో ఎంఈఓ కార్యాలయం వద్ద సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో చర్ల మండలానికి పర్మినెంట్ ఎంఈఓ నియమించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ నాయకుడు కొండాచరణ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలంలో పర్మినెంట్ ఎంఈఓ లేకపోవడం వల్ల ప్రాథమిక విద్యారంగం సంపూర్ణంగా రోజురోజుకీ నాశనం అవుతుందని వాపోయారు గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాథమిక విద్యారంగం సర్వనాశనం అయిందని విమర్శించారు చర్ల మండలానికి పర్మినెంట్ ఎంఈఓ లేకపోవడం వల్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజుకి తగ్గుముఖం పడుతుందని పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా పడిపోతుందని ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా నడుచుకోవడం లేదని పాఠశాలలో నాణ్యమైన వస్తువులు కల్పించడం లేదని సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు నియామకం జరగడంలేదని ఎన్నో పాఠశాలలు శిధిలావస్థలకు చేరాయని అన్నారు సమస్యల సుడిగుండంలో ప్రాధమి ప్రాథమిక విద్యారంగంలో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారని ప్రస్తుత ప్రజల ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నన్న ఏజెన్సీ ప్రాంతంలో ప్రాథమిక విద్యారంగాన్ని అభివృద్ధి చేసి ఎస్టి ఎస్సి బిసి మైనారిటీ ఎంబీసీ ఓసీ లోని నిరుపేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు లేనియెడల భవిష్యత్తులో మండల విద్యారంగాన్ని కాపాడుకునే దానికోసం ప్రజాపంద ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ఐ ఎఫ్ టి యు సంఘం మండల నాయకులు MLN రెడ్డి మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొండ కౌశిక్ పాలన్ చుక్కయ్య చెన్నై మోహన్ మెహమదా తదితరులు పాల్గొన్నారు