నేటి గద్దర్ పాడేరు న్యూస్:
అల్లూరి జిల్లా పాడేరు జూన్ 28 మహిళలు పనిచేసే ప్రదేశాలలో ఎటువంటి లైంగిక వేదింపులకు గురికాకుండా అరికట్టే దిశగా మహిళల రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి అన్నారు. ఐటిడి ఏ సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో సమావేశ మయ్యారు. పది మంది ఉద్యోగులు ఉన్న ప్రతీ ప్రభుత్వ కార్యాలయాల్లో ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసి నివేదికలు సమర్పించాలన్నారు. అన్ని మండల కార్యాలయాలలోను కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 మరియు 15 హెచ్ ప్రకారం గౌరవంగా జీవించే హక్కు, ఏదైనా వృత్తిని అభ్యసించే హక్కు మరియు లైంగిక వేదింపులు గురికాకుండా సురక్షితమై వాతావరణం కలిగి ఉండే హక్కులను పొంది ఉన్నారన్నారు. మహిళలు స్వేచ్ఛగా భద్రత కలిగి ఏదైనా వృత్తి, వ్యాపారం నిర్వహించడానికి అవసరమైన వాతావరణ కలిగి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసిడి ఏస్ పథక సంచాలకులు సూర్యలక్ష్మి, వివిద శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.