నేటి గదర్, జూన్ 28,
ములుగు జిల్లా ప్రతినిధి,
కౌశిక్ 6281272659:
పేరుకే ములుగు జిల్లా హాస్పిటల్ మౌలిక సదుపాయంలో గ్రామీణ హాస్పిటల్ కంటే అద్వాన్నంగా ఉందని ములుగు బి ఆర్ ఎస్ నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న అన్నారు. ములుగు ఏరియా హాస్పిటల్ ను ఆయన శుక్రవారం సందర్శించి పేషంట్ల ను ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూక్య జంపన్న మాట్లాడుతూ ములుగు ఏరియా హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు సరిగా లేనందున అనారోగ్యంతో వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనాలకు సరిపడా డాక్టర్లు లేనందున కొంతమంది సిబ్బందితోనే కాలం గడుపుకుంటూ వస్తున్నారు డాక్టర్ల కొరత ఉన్నందున సరైన సమయంలో వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని భూక్య జంపన్న తెలిపారు ములుగు ఏరియా హాస్పిటల్ లో సరిపడా డాక్టర్లను నియమించాలని ప్రభుత్వాన్ని భూక్య జంపన్న డిమాండ్ చేశారు హాస్పిటల్ నందు అపరిశుభ్రత నెలకొని ఉంది అసలే వర్షాకాలం రోగానికి అతిథి లాంటిది కాలం అనారోగ్యంతో వస్తున్న ప్రజలకు ఇక్కడ అశుభ్రంగా ఉండడం వలన వాళ్ల ఆరోగ్యం ఇంకా పాడవుతుంది ఇక్కడికి వచ్చి లేని రోగాలని కూడా కొని తెచ్చుకోవడం జరుగుతుంది 20 టాయిలెట్స్ ఉన్నా కూడా దానిలో కేవలం మూడు నాలుగు మాత్రమే పనిచేయడం సిగ్గుచేటు ఇక్కడికి వచ్చే పేషెంట్లు సరిపడా వైద్యం అందక ఇక్కడి డాక్టర్లు వరంగల్ కు రిఫర్ చేస్తున్నారు ఎమర్జెన్సీ ఉన్న ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా పీరియా ట్రిక్స్ ఉన్నప్పటికీ వాడకుండా హనుమకొండ వరంగల్ హాస్పిటల్ లకు రిఫర్ చేస్తున్నారు దీనిని ఉన్నత అధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్పిటల్ లో సిబ్బంది మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలి అని భూక్య జంపన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎలక్ట్రికల్ శానిటరీ అన్ని అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ప్రజల తరఫున భూక్య జంపన్న ఉన్నతాధికారులకు మరియు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న తనతోపాటు గుండారపు రాజు అన్నారపు నాగర్జున దేవన బోయిన శ్రీను బుర్రి దేవేందర్ సతీష్ తిరుపతి లక్ష్మణ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.