నేటి గద్దర్ వెంకటాపురం
ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం వైస్ జంక్షన్ లో సీఐ బండారి కుమార్, ఎస్సై హరీష్ పోలీస్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా చతిస్గడ్ రాష్ట్రం నుండి వెంకటాపురం వైపు వస్తున్న తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారు పోలీసులను చూసి కొంత దూరంలో ఆపి వెనుకకు తిప్పి పారిపోవడానికి ప్రయత్నించారు. వాహనమును పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద కత్తి లభించింది. అనుమానంతో వారి వివరాలు తెలుసుకొనగా అసలు గుర్తు రట్టయింది.
బట్ట నీరాజ్ కుమార్, 19 సంవత్సరాలు, బెస్త గూడెం గ్రామం, కవ్వల వెంకట శ్రీనివాస్, వీరభద్రారం గ్రామం, పూనం దిలీప్, అను వ్యక్తులు అర్ధరాత్రి వాజేడు మండలంలోని ప్రగల్ల పల్లి గ్రామం, శివారులో లారీలను ఆపి వారికి కత్తి చూపించి బెదిరించి వారి ప్రాణాలకు హాని కలిగించే విధంగా దాడి చేసి లారీ డ్రైవర్ వద్ద నుండి 3000 రూపాయలను బలవంతంగా వసూలు చేసినట్టు చెప్పి నేరం అంగీకరించగా పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న కత్తి, 1500 రూపాయలు, స్విఫ్ట్ డిజైర్ వాహనము సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సిఐ కుమార్ తెలిపారు. గ్రామాలలో యువత ఎవరైనా ఆకతాయి కార్యకలాపాలకు, దారి దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.