◆జిల్లా అధికారులు అక్రమ కట్టడాలు నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోని దిగువ స్థాయి అధికారులు
◆జిల్లా అధికారులు ఆదేశాలు భేఖాతారు ముడుపుల లేక నిర్లక్ష్యమా…?
( హుకుంపేట అల్లూరి జిల్లా న్యూస్ )
అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో గిరిజనేతరులు అక్రమ కట్టడాలు రోజు రోజుకి అధిక మవుతున్నాయి. గిరిజనులకి సంబందించి 1/70 చట్టం ప్రకారం గిరిజనేతరులు మన్యంలో శాశ్వత భవనాలు కట్టకూడదు అనే విషయం తెలుసు అయినప్పటికీ 1/70 చట్టం తుంగలో తొక్కి నిర్మాణాలు కడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ భూములు సైతం కబ్జాలు చేసి కడుతున్నారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకునే స్థితిలో లేరు దీని బట్టి చుస్తే సంబంధిత అధికారులు కాసులకు కక్కుర్తి పడి గిరిజనులు హక్కులూ చట్టాలు గాలికి వదిలేసి గిరిజనేతరులకు కొమ్ము కాస్తూన్నారానే విమర్శలు వెళువెత్తుతున్నయి విమర్శలు కాదు వాస్తవం అని చెప్పాలి. దీనికి నిదర్శనం ఏమిటంటే హుకుంపేట ప్రధాన కూడలి ప్రక్కన అక్రమ నిర్మాణాలు తక్షణమే నిలిపివేసి నోటీసులు జారి చేయమని జిల్లా వున్నతధికారులు ఆదేశాలు జారీ చేశారు కానీ సంబంధిత అధికారులు జిల్లా అధికారులు భేఖాతారు అంటూ నిర్లక్ష్య ధోరణిగా వ్యవహారిస్తున్నారు నిజమా కాదా అనే విషయం తెలియాలంటే పై వున్నా ఫోటోలు మరియు వీడియోలు చూస్తే నేరుగా కనిపిస్తుంది.తార్పానులు అడ్డు పెట్టి నిర్మాణలు చేపడుతున్నారు ఈ దృశ్యాలు అందరికీ కనిపిస్తున్నాయి కానీ సంబంధిత అధికారులకు కనిపించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది జిల్లా అధికారులే గుర్తించాలి. మండల స్థాయి అధికారులకు ఇవి అక్రమ కట్టడాలు అని తెలిసిన తమ విధులు సక్రమంగా చేయటం లేదు అనేది నేరుగా కనిపిస్తుంది కనుక జిల్లా అధికారులు దీనిపై ద్రుష్టి సారించి విచారణ చేపట్టి ఈ అక్రమ కట్టడాలకు కొమ్ము కాస్తున్న వారిని గుర్తించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోని గిరిజనులు హక్కులు చట్టాలు కాపడాలని పలువురు అంటున్నారు. విశ్వసనియమైన సమాచారం మేరకు ఈ సమస్య వేగవoతంగా పరిష్కారం చేయకపోతే మన్యంలో గల గిరిజన సంఘాలు అందరూ మమేకమై గిరిజనులు హక్కులు చట్టాలు కాపాడుకునేందుకు పోరాటాలు ఉద్యమాలు చేయడం ఖాయం అనే విషయం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి గిరిజనేతరులు అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూములు సైతం కబ్జాలు చేస్తున్నారు అనేది అధికారులకు తెలిసిన పట్టించుకోక పోవడం వలనే ఈ సమస్య నేడు తారాస్థాయికి చేరిందనే విషయం కనిపిస్తుంది కనుక జిల్లా అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి సంబంధిత అధికారులుఫై అలాగే అక్రమ నిర్మాణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది లేకుంటే ఈ సమస్య తారస్థాయికి చేరడం కనిపిస్తుంది మరి జిల్లా అధికారులు ఈ సమస్య పై ద్రుష్టి సారించి సమస్య పరిష్కారం చేసి గిరిజనులు హక్కులు చట్టాలు కాపాడుతారా లేదా అనేది….?