రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూన్ 29:-
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికార కార్యాలయంలో శనివారం రోజు ఉదయం కరీంనగర్ ఎంపి,కేంద్ర హోం సహాయ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ బండి సంజయ్ గారిని మొదటిసారిగా ఆయన అధికార కార్యాలయంలో మెదక్ నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి, నిజాంపేట జడ్పీటీసీ సభ్యులు పంజ విజయ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలుపటం జరిగిందని రామాయంపేట పట్టణ బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ తెలిపారు.అదేవిధంగా మెదక్ లో బిజెపి పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.మెదక్ లో పార్టీ జెండాని భుజాల మీద వేసుకుని ప్రతి కార్యకర్త నుండి నాయకుల వరకు పని చేసి అధికారంలోకి తీసుకురావాలని సూచించారని తెలిపారు.నీవు మెదక్ ఎమ్మెల్యే కావాలని పంజ విజయ్ కుమార్ ను కోరినట్లు ఆయన తెలిపారు.బిజెపి పార్టీ ఎల్లప్పుడు కార్యకర్తలకు,నాయకులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని ఆయన వెల్లడించారు.పంజ విజయ్ కుమార్ వెంట బిజెపి నాయకులు జె.శంకర్ గౌడ్, భరత్ కుమార్ ఉన్నట్లు ఆయన తెలియపరచారు.