నేటి గద్దర్, హుకుంపేట న్యూస్:
అల్లూరి జిల్లా,హుకుంపేట మండలంలోని,గన్నేరు పుట్టు పంచాయితీ, డొంకిన వలస ఎంపీపీ స్కూల్ లో 1 నుండి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్ బ్యాగులను హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండల రావు మాట్లాడుతూ.1 నుండి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థుల కు ప్రతీ సంవత్సరం బ్యాగులు ఇవ్వటంతో పుస్తకాలు,నోటు పుస్తకాలు,పెన్నలు, పెన్సిళ్లు దారిలో పడి పోకుండా ఎంతో సౌకర్య వంతంగా ఉంటుందని చెప్పారు, విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలంటే ప్రాథమిక విద్యా నాణ్యతగా ఉంటేనే సాధ్యమన్నారు.ప్రాథమిక విద్యా బలోపేతానికి ప్రభుత్వ స్కూల్ లను కేరళ రాష్ట్రంలో మాదిరిగా డిజిట లైజేషన్ చేయాలని కోరారు.బట్టి పట్టే చదువులు కాకుండా సృజనాత్మక కూడిన విద్యా అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం బాకూరు రాజు బాబు,ఉపాధ్యాయులు బాకూరు గోపాల్ రాజు, గ్రామ స్తులు డుంబేరి పెంటు దొర, తంబోలి మత్స్య బాబు,విద్యార్థులు పాల్గొన్నారు.