నేటి గద్దర్ , హుకుంపేట న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కోట్నాపల్లి పంచాయతీ కొత్తవలస గ్రామంలో నిర్వహిస్తున్న నాలరాయి క్వారి బాధ్యత గ్రామంలో సీపీఐ నాయకులు గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు అమర్ పాల్గొని మాట్లాడుతూ కొట్నాపల్లి వద్ద కొత్తవలస గ్రామం నందు ఈ క్వారీ లో భారీ ఎత్తున బాంబులు బ్లాస్టింగ్స్ చేయడం వలన భారీ ఎత్తున శబ్దం మరియు బ్లాస్టింగ్ వాయువులు గ్రామాల పై వెదజల్లడం జరుగుతున్నది. అలానే పెద్ద ఎత్తున దుమ్ము ధూళి తో కప్పుకుంటుంది. వీటిని పిలుస్తున్న గిరిజన చిన్నారులకు, ప్రజలకు అనారోగ్యం బారిన పడుతున్నారని అలానే బారి ఎత్తున బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు కు చిన్నారులు,ముసలివాళ్ళు,విద్యార్థులు,ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడి బయందోళనకు గురికావడం జరిగుతుందని, గుండె అదరడం ఊపిరితిత్తి సమస్యలు, కిడ్నీ సమస్యలు, గర్భం కోల్పోవడం, పుట్టేటటువంటి పిల్లలకు వినికిడి శక్తి కోల్పోవడం వంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుయని అన్నారు. అక్క ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని అక్కడ ఉన్నటువంటి మీరు తాగి జబ్బులు పాలు అవుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారని. అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో పశుసంపద కూడా అనారోగ్యం బారిన పడి చనిపోతున్నాయని అన్నారు. కావున జిల్లా వైద్య అధికారులు తక్షణమే స్పందించి పొట్నాపల్లి క్వారీ నిర్వాహన వలన బాధిత గ్రామాలు అయినటువంటి కోట్నపల్లి,కొత్తవలస,సువ్వాపడు,చక్రిఫుట్,మారేలా,పందిమెట్ట,మత్స్యపురం,పెద్దగరువు తదితర గ్రామాలలో మెడికల్ క్యాంపు లు నిర్వహించాలని ఆయన అన్నారు.అక్కడ అనారోగ్య సమస్యలను గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.
సీపీఐ నాయకులు కిముడు శివ శంకర్ గ్రామస్థులు ప్రసాద్,కోటిబాబు,సూరిబాబు,వాసు,అప్పారావు,నీలమ్మా, కర్రమ్మ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.