★CPIML మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి
నేటి గదర్ న్యూస్,మణుగూరు:
వలస ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని జులై 1వ తారీఖున భద్రాచలం లో జరిగే ప్రదర్శనను, ఐటీడీఏ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి వలస ఆదివాసీలను కోరారు. శనివారం మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని వలస ఆదివాసీ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో జీవిస్తున్న మూల ఆదివాసీలను గత BRS ప్రభుత్వం అసలు గిరిజనులే కాదని వారినీ అవమానించింది. ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని ఇక్కడ భూమిపై వీరికి హక్కు లేదని పోడు పట్టాలు ఇవ్వమని, వారికి ఇచ్చిన సర్టిఫికెట్లను రద్దు చేయాలని భవిష్యత్తులో ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పింది. దాని కారణంగా ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు సర్టిఫికెట్లు లేక విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. ఎన్నికల్లో మూల ఆదివాసులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఏజెన్సీ గ్రామాల పోడు సాగుభూములు అన్నింటికీ పట్టాలిచ్చి సాగునీటి సౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా వలసదివాసి గ్రామాలకు రక్షిత మంచినీరు, విద్యుత్తు, రహదారి సౌకర్యం, విద్యా ,వైద్య సదుపాయం ,రేషన్ కార్డులు, కుల సర్టిఫికెట్ ఇవ్వాలని, అందుకు అవసరమైన నిధులు కేటాయించి కృషి చేయాలని అన్నారు. వలస ఆదివాసీల పోడు భూములకు సర్వే చేసి పట్టాలి ఇవ్వాలని, వారి గ్రామాలకు ఇండ్లకు గ్రామపంచాయతీలో నమోదు చేసి, ఇంటి నెంబర్లు ఇవ్వాలని అన్నారు. వలసదివాసి ఎడల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష సూపరాదని గిరిజనులకు అందినట్లే ప్రభుత్వ సబ్సిడీలు సౌకర్యాలు కల్పించాలని ,వ్యవసాయ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం జూలై ఒకటవ తారీఖున భద్రాచలం లో జరిగే ప్రదర్శనను, ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని ప్రతి మూలా ఆదివాసి పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గంగయ్య, భీమయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు