★280 మందికి షుగర్, 310 మందికి హైపర్ టెన్షన్
★6350 మందికి వైద్య సహాయం
నేటి గదర్ న్యూస్,చర్ల:
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం ఆధ్వర్యంలో మారుమూల గిరిజన గ్రామాలకు ఇంటి వద్దనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రధానంగా వయోవృద్ధులు, వికలాంగులకు సహాయం కొరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి కె. మదన్ మోహన్,రాష్ట్ర ప్రోగ్రాం ఇంచార్జి స్వర్ణలత వారి నిర్దేశంతో మొబైల్ మెడికల్ కేర్ యూనిట్ ద్వారా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం అని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కో ఆర్డినేటర్ Dr. SL కాంతారావు అన్నారు.చర్ల మండలం లోని కొత్తగట్ల గిరిజన గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించిన 90 మందికి మందులు పంపిణి చేశారు. అదేగ్రామంలో 10 కుటుంబాలకు
టార్పలిన్స్ ను అందజేయడం జరిగింది.ఇప్పటి వరకు నిర్వహించిన వైద్య శిబిరాలలో 6350 మందికి వైద్య సహాయం అందించి మందులు పంపిణి చేసినారు.గర్భిణీ
సీలకు తలసీమియా సికెల్ సెల్ అనీమియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినారు.
డయాబెటిక్, హైపర్ టెన్షన్ వ్యాధుల సర్వే నిర్వహించగా, 280 మందికి షుగర్, 310 మందికి
హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నట్లుగా తెలిసినది .దాదాపుగ 6% గా పట్టణ
ప్రాతం కంటే తక్కువ నమోదు అయినది.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం ఆధ్వర్యంలో మారుమూల గిరిజన గ్రామాలైన చర్ల,
పర్ణశాల, నర్సాపురం, దుమ్ముగూడెం, దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నేటివరకు 98
ఆరోగ్య వైద్య శిబిరాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమం లో Dr SL కొంతారావు, Dr V కామేశ్వర్రావు, In Y సూర్యనారాయణ, G. రాజారెడ్డి, Dr సందీప్, Dr ASR చంద్ర ప్రసాద్, Dr భాను ప్రసాద్, Dr పుల్ల రెడ్డి, Dr దివ్య నయన్, Dr రేణుక రెడ్డి,
, పోడియం మొరలి సర్పంచ్ ,హెల్త్ అసిస్టెంట్ తురం వేణు ఆయా సరమ్మ, రాజ్య లక్ష్మి ఏఎన్ఎం
రవి, అది, మారుతీ నర్సింగ్ కాలేజీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.