+91 95819 05907

దొడ్డి కొమరయ్య వర్ధంతి సదస్సును జయప్రదం చేయండి

★దొడ్డి కొమరయ్య వర్ధంతి సదస్సును జయప్రదం చేయండి

★సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు…ఆవునూరి మధు

నేటి గదర్ న్యూస్ ,జూన్ 29 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొరలను, భూస్వాములను గడగడలాడించి ప్రజల కోసం ప్రతిఘటన పోరాటంలో అసువులు బాసిన తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు పిలుపిచ్చారు… కూసుమంచి మండలం కేంద్రంలో జరిగిన పాలేరు డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నేడు దేశంలో పెట్రేగిపోతున్న పాసిజానికి వ్యతిరేకంగా, హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాటి నుండి నేటి వరకు దున్నేవారికి భూమి దక్కకుండా భూస్వాములు రూపం మార్చుకొని వేలాది ఎకరాలను తమ కబంద హస్తాలలో పెట్టుకున్నారన్నారు. కారిడార్ ల పేరుతో, సెజ్ ల పేరుతో, పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను దోచుకు తింటున్నారన్నారు. ఆదివాసీలను, గిరిజనులను, పేద ప్రజలను అణసివేసే కుట్టలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ప్రజలకు కావాల్సిన చట్టాలను చేయకుండా భారత రాజ్యాంగాన్ని మార్చివేసే దుర్మార్గమైన విధానాలను ప్రభుత్వాలు పాలకులు తీసుకొస్తున్నారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో దొడ్డి కొమరయ్య లాంటి త్యాగాలను నెమరు వేసుకుంటూ మరో స్వతంత్ర పోరాటానికి ప్రతిఘటన పోరాట సిద్ధాంత వెలుగులో తిరుగుబాటుకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరు వెంకటరామిరెడ్డి, ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ, డివిజన్ నాయకులు ఐ వెంకన్న, గొర్రెపాటి రమేష్, శీలం సుదర్శన్, మాతంగి రామస్వామి, చెరుకుపల్లి వీరయ్య, వెంకటేశ్వర్లు, ఉప్పలయ్య, ఎస్కే రహీం, గొర్రెపాటి వీరస్వామి,శ్రీకాంత్, పోలేపొంగు నాగయ్య, భత్తుల ఉప్పలయ్య, ఉమాశంకర్, నరసింహ, పోకల వెంకన్న , చారీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 18

Read More »

 Don't Miss this News !