నేటి గద్దర్ న్యూస్, వెంకటాపురం :
వెంకటాపురం మండలం కేంద్రంలో ఎదిర పంచాయతీ పరిధిలో గల యాకన్నగూడెం గ్రామంలో పంచాయితీ రాజ్ చట్టం పైన అవగాహన సదస్సు కాఫెడ్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యం లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసింహమూర్తి హాజరు అయినారు. నరసింహమూర్తి మాట్లాడుతూ పంచాయతీ రాజ్ సంస్థలు గ్రామ స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి, ఇది గ్రామాల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ముఖ్యంగా ప్రాథమిక విద్య, ఆరోగ్యం, వ్యవసాయ అభివృద్ధి, మహిళలు మరియు పిల్లల అభివృద్ధి మరియు స్థానిక ప్రభుత్వంలో మహిళల భాగస్వామ్యం మొదలైనవి అని తెలియ చేసారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం మండల కోఆర్డినేటర్ జి హనుమంత్ వాజేడు మండల కోఆర్డినేటర్ కామేష్ యానిమేటర్స్ ఇందిరా ఉషారాణి పద్మ ప్రశాంత్ నరేష్ 50 మంది పాల్గొన్నారు
Post Views: 174