నేటి గద్దర్ న్యూస్ , పాడేరు :
అల్లూరి జిల్లా పాడేరు జూన్ 28 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధులు ఖర్చుల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేసారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధుల ఏజెంట్లు ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో చేసిన ఖర్చులను సంబంధిత రికార్డులలో నమోదు చేసి నియోజక వర్గం వ్యయ పరిశీలకులతో రికన్సిలేషన్ చేసి సమర్పించాలని సూచించారు. వాటిని పూర్తిగా పరిశీలించిన తరువాత ఎన్నికల కమిషన్కు పంపించవలసి ఉంటుందన్నారు. వ్యయ పరిశీలకులు నియోజక వర్గంలో అభ్యర్ధులకు లేదా వారి ప్రతినిధులకు అందుబాటులో తగిన విధంగా సహకరించాలని ఆదేశించారు. ఎన్నికలకు నిధులు ఎక్కడ నుండి వచ్చాయి. ఎవరు ఇచ్చారు వంటి వివరాలతో ఖర్చులను పక్కాగా అందజేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలక్టర్ భావనా వశిష్ట, ఎన్నికల వ్యయ పరిశీలకులు పంకజ్ సింగ్. నోడల్ అధికారి సువర్ణ ఫణి వివిధ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.