రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
నేటి గద్దర్ పాడేరు న్యూస్:
పాడేరు జూన్ 29 : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై 1 వ తేదీన ఉదయం 6.00 గంటలకే తలుపు తట్టి లబ్దిదారులకు సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని రాష్ట్ర ప్రధాన కార్య దర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం అమరావతి నుండి సామాజిక పింఛన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన సమయానికి సచివాలయం సిబ్బంది లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని సూచించారు. బ్యాంకర్లతో మాట్లాడి అవసరమైన డబ్బును డ్రా చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఆదివారం బ్యాంకులను తెరిచి డబ్బు డ్రా చేయాలని ఎటువంటి జాప్యం లేకుండా మొదటి రోజే 95 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేసారు. ప్రతీ రెండు గంటలకు పింఛన్ల పంపిణీ | శాతాన్ని పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
పింఛన్ల పంపిణీలో పొరపాట్లు జరిగితే కఠిన చర్యలు
అల్లూరి జిల్లా పాడేరు అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశ మయ్యారు. క్షేత్ర స్థాయి పింఛన్ల పంపిణీలో అవినీతికి పాల్పడితే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు. లబ్దదారులకు ఎక్కవ, తక్కువ గా పింఛన్లు అందినట్లు | ఫిర్యాదులు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. లబ్దిదారులకు రూ.7వేలు అందినట్లుగా రశీదు పొందాలని చెప్పారు. ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు. పింఛన్ల పంపిణీని జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావనా వశిష్ట, డి. ఆర్.డి.ఏ. పి.డి. మురళి తదితరులు పాల్గొన్నారు.