-21 కేజీల గంజాయి పట్టివేత
– వివరాలు వెల్లడించిన పోలీసులు
నేటి గదర్ న్యూస్ , పినపాక:
పినపాక మండలంలో భారీగా గంజాయిని ఈ బయ్యారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ వెంకటప్పయ్య తెలిపిన వివరణ ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తనకు వచ్చిన సమాచారం మేరకు సీఐ కరుణాకర్ ఆదేశాల మేరకు సిబ్బందితో ఉప్పాక క్రాస్ రోడ్ వద్ద తనిఖీ నిర్వహించామన్నారు. ఈ తనిఖీలలో షిఫ్ట్ డిజైర్ కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్సై తెలిపారు. వారి వద్ద నుండి 12 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని వీరందరినీ నేడు(ఆదివారం) కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. టీఎస్26జీ0686 నెంబర్ గల కారులో జాటోత్ సురేష్ @ కన్నా, (కారు డ్రైవర్), జాటోత్ విజయ్( కార్ డ్రైవరు) R/oఅమరసింఘ్ తండా, నున్నావత్ గణేష్( ఆటో డ్రైవరు), జాటోత్ భాస్కర్( ఆటో డ్రైవరు) పైన కేసు నమోదు చేశామన్నారు.
వీరిలో మొదటి ముద్దాయి హసన్పర్తి పోలీస్ స్టేషన్, మోతుగూడెం పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని వీరు నలుగురు ఒక ముఠాగా ఏర్పడి సీలేరు నుంచి గంజాయి కొనుక్కుని నిమిత్తం కారులో వెళ్లి వీరికి ఇదివరకే పరిచయం ఉన్న అనిల్ కుమార్ మరియు రాంబాబుల దగ్గర ఒక రెండు ప్యాకెట్లు నాలుగు కిలోల గంజాయిని అదే విధంగా వీరికి జైలులో పరిచయమైన బూర్గంపాడుకు చెందిన మునావర్ దగ్గర ఒక పది ప్యాకెట్ల గంజాయిని కొనుక్కొని వీటిని హైదరాబాదుకు చెందిన సతీష్ కి చేరవేసే నిమిత్తం భద్రాచలం అశ్వాపురం మణుగూరు మీదుగా ఏడుల బయ్యారం ఉప్పాడ క్రాస్ రోడ్ కి రాగా ఇక్కడ వీరిని పట్టుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.
12 ప్యాకెట్ల నుండి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.