★ విద్యుత్ అవుట్ పుట్ ట్రాన్స్ఫార్మర్లపై పడిన పిడుగు?
★ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ మూలంగా ఎగసిపడుతున్న మంటలు
★ నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న ఫైర్ సిబ్బంది
★BTPS కు భారీ నష్టం వాటిల్లే అవకాశం
నేటి గదర్ న్యూస్,పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మణుగూరు మండలాల సరిహద్దులో నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (BTPS) లో విద్యుత్ అవుట్ ఫుట్ ట్రాన్స్ఫార్మర్లు శనివారం రాత్రి పిడుగుపాటుకు గురయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు, విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి.BTPS విద్యుత్ కేంద్రంలో శనివారం సాయంత్రం మేఘావృతమై వర్షం కురిసింది. ఈ క్రమంలోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ అవుట్ ఫుట్ ను ఇచ్చే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లపై పిడుగు పడటంతో భారీగా మంటలు ఎగిసి పడుతున్నట్లు సమాచారం. ట్రాన్స్ఫార్మర్లు ఉండే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ మంటలు ఎగిసిపడడానికి కారణంగా అధికారులు గుర్తించారు.
★నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న ఫైర్ సిబ్బంది★
బి టి పి ఎస్ లో పిడుగుపాటు మూలంగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. బి టి పి ఎస్ కు చెందిన రెండు ఫైర్ ఇంజన్లు, మణుగూరు ,పినపాక మండలాలకు చెందిన మరో రెండు ఫైర్ ఇంజన్లు అగ్నిమాపక అధికారి పి.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ప్రాణా నష్టం సంభవించలేదని తెలియ వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం మూలంగా బిటిపిఎస్ కు భారీ నష్టం వాటిల్లే ఆస్కారం ఉందని సమాచారం.