ఆ గ్రామంలో చినికు పడితే చిత్తడే
★భూపాలపట్నం(చిపిరి దుబ్బ) గ్రామస్థుల కష్టాలు మాములు గా లేవు!
★ ప్రధాన రహదారి వారికి శాపంగా మారింది
★ ఇళ్ల ముందే నిల్వ ఉంటున్న వరద
★ఆ ఇంటికి శాపంగా CC రోడ్డు
★అధికారులు పట్టించు కోవాలి
నేటి గదర్ న్యూస్,పినపాక: ఆ గ్రామం ప్రధాన రహదారి పక్కనే ఉంది. కానీ ఆ రహదారి వారికి కష్టాలు తెచ్చి పెట్టింది. రహదారి నిర్మాణం చేపట్టారు కానీ వర్షం కురిసినప్పుడు వరద నీరు పోవడానికి ఆర్ అండ్ బి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వెరసి వర్షం కురిసిందంటే ఆ గ్రామ ప్రజల కష్టాలు చెప్పక్కర్లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపాలపట్నం పంచాయతీ భూపాలపట్నం ప్రజల కష్టాలు మామూలుగా లేదు. వర్షాకాలం వచ్చిందంటే వారి కష్టాలు స్టార్ట్ అయినట్టే. వరద నీరు పోవడానికి సరైన ఏర్పాట్లు అధికారులు చేయకపోవడంతో ఇంటిముందే నీరు నిల్వ ఉంటుంది. దీనితో ఆ గ్రామస్తులు ప్రతి సంవత్సరం సీజనల్ వ్యాధుల బారిన తరుచు పడుతూ ఉంటారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి తమ గ్రామ సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
★ఆ సిసి రోడ్డు తో ఇళ్ళ లోకి చేరుతున్న వరద నీరు★
భూపాలపట్నం గ్రామంలో చర్చి పక్కన ఇటీవల అధికారులు నూతనంగా ఓ సి సి రోడ్డు నిర్మాణం చెప్పటం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ సీసీ రోడ్డు కొంతమంది గ్రామస్థులకు ఇబ్బందిగా మారింది. సీసీ రోడ్డు నిర్మాణంతో వరద నీరు పోవడానికి ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పంచాయతీ అధికారులు దృష్టి సారించి తమ సమస్యను పరిష్కరించాలని ఆయా ఇళ్ళ యజమానులు కోరుతున్నారు.