★125 మందికీపైగా విప్లవ ప్రజలను, పార్టీ కార్యకర్తలను, నాయకత్వాన్ని పి.ఏల్.జి.ఐ యోదులను హత్య
★6 నేలల చిన్నారీ నుండి 60 సంవత్సరలు దాటిన పౌరులు ఉన్నారు.
★నిరసనగా జులై 1న ప్రపంచ కగార్ వ్యతిరేక దినం పాటించండి
★భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్)భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్)
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
జులై 1, ప్రపంచ కగార్ వ్యతిరేక దినం పాటించాలనీ భారత ప్రజాయుద్ధ అంతర్జాతీయ సంఘీభావ కమిటీ పిలుపు నిచ్చింది. ఈ సంధర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరీ సీతారామరాజు డివిజన్ కమిటీ ముందుగా భారత ప్రజాయుద్ధ అంతర్జాతీయ సంఘీభావ కమిటీకి ఆ పార్టీ రెడ్ సాల్యుట్స్ అందచేస్తుందని పేర్కొన్నారు .శనివారం ఆ కమిటీ మావోయిస్టు ప్రతినిధి ఆజాద్ పేరున ఓ లేఖను విడుదల చేసింది.ఇటీవల 2024 జనవరి నుండి ఆపరేషన్ కాగర్ పేరుతో ప్రజాయుద్ధాని తుదకంటా నిర్ములించడానికి భారత కేంద్ర రాష్ట్రా దోపిడీ పాలకవర్గాలు నూతన సైనిక కేంపెయిన్ ను చేపట్టి కొనసాగిస్తున్నవి తెలిపారు. ఈ సైనిక కేంపెయిన్ లో ఇప్పటివరకు 125 మందికీపైగా విప్లవ ప్రజలను, పార్టీ కార్యకర్తలను, నాయకత్వాన్ని పి.ఏల్.జి.ఐ యోదులను హత్య చేశారు. వీరిలో 6 నేలల చిన్నారీ నుండి 60 సంవత్సరలు దాటిన పౌరులు ఉన్నారు. వారందరి స్మృతిలో విప్లవ జోహార్లు అర్పించి పీడిత ప్రజలపై ఈ ప్రభుత్వాలు తలపెట్టిన యుద్దాన్ని తక్షణం నిలిపివేయాలనీ ప్రజలపై కొనసాగిస్తున్న పాశవిక సైనిక దాడులను నిలిపివేయాలి. అంతర్జాతీయ సంఘీభావ కమిటీ పిలుపును, భారత ప్రజలు, పీడిత ప్రజలు, కార్మిక కార్షిక విప్లవ ప్రజలు, ఈ పిలుపు స్వాగతిస్తూన వీరికి విప్లవాభివందనాలు తెలియచేస్తుందన్నారు.
అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఆసియా ఖండంలోని పెక్కు దేశాలు భారత ప్రభుత్వాన్ని, భారత ప్రజల పై తలపెట్టినా కగార్ దాడిన్ని ఆపాలని డిమాండ్ చేస్తోంది. ఈ ప్రజాయుద్ధ సంఘీభావ కమిటీ పిలుపును భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు, కేంద్ర కమిటీ కాగర్ వ్యతిరేక దినం పాటించాలీ అనే దీనిలో భాగంగా డివిజన్ వ్యాప్తంగా ఉన్న పలు విప్లవ సంస్థలు శక్తులు, ప్రజాస్వామిక వాదులు, పాత్రికేయులు, రచయితలు, కళాకారులు, ఆదివాసీ సామాజిక కార్యకర్తలు, కీళ్లు, కార్మిక కార్షిక విద్యార్థులు, వివిధ రూపంలో కగార్ సైనిక దాడులను ఖండించాలని కోరారు. పోలిసుల చట్ట వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
విప్లవ ప్రతిఘాతుక ఆపరేషన్ “కగార్” ను ఓడిద్దాం! ఆపరేషన్ “కగార్”కు వ్యతిరేకంగా జులై 1న నిరసన దినంగా పాటించాలన్నారు. భారత విప్లవోద్యమాన్ని పురోగమింపజేద్దాం అని ఆ లేఖలో కోరారు.