నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
✍️సతీష్ కుమార్ జినుగు :
ఖమ్మం పట్టణంలో గల ద్వారాకానగర్ 53 వ డివిజన్ లో ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆఫీస్ కి కూత వేటు దూరంలో చెత్త కుప్పలు దర్శనం ఇస్తున్నయి. స్వచ్ఛ భారతలో భాగంగా ప్రతి రోజు చెత్త బండి ఇంటి ముందుకు వచ్చి చెత్త తీసుకొని పోతుంటాయి, కానీ గత 4 రోజులుగా ద్వారకానగర్ 53 వ డివిజన్ లో చెత్త బండి రాక చెత్త ఇలాగే పేరుకు పోతుంది. అసలే వర్షం కాలం,పైగా డైయేరియా, మలేరియా, డెంగీ, వ్యాదులు సోకే ఈ సమయంలో అయినా కనీసం చెత్త ప్రతి రోజు తీసుకెళ్లాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.చెత్త బండ్లు సమయానికి ఇంటి ముందుకు రాకపోవటం వలన, ఇంట్లో చెత్త ఉంచితే రోగాలు అంటుకొంటాయన్న భయంతో బయట వేస్తున్నట్లు ఆ డివిజన్ ప్రజలు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు తమ విధి పట్ల నిర్లక్ష్యం వదిలి ప్రజల ఆరోగ్యన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజు చెత్త బండి ఇంటి ముందుకు వచ్చే విధంగా చూడలని,చెత్త సేకరణ జరగాలని కోరారు.