జనవాసాల్లోకి అరుదైన జంతువు అడవి అలుగు(పంగోలిన్)
★ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు
★ బహిరంగ మార్కెట్లో దాని విలువ కోటి 50 లక్షల పై మాటే ?
★అలుగు మాంసం కిలో రూ.30 వేలు?
◆చైనా లో ఔషధ ప్రయోజనాల కోసం,ఆభరణాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాలెట్ల తయారీకి కూడా ఉపయోగిస్తారట
నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగడ్డ గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో అలుగు అనే అరుదైన అటవీ జీవి ఆదివారం లభ్యమైనది . చుట్టుపక్కల ప్రజలు వింత జీవి కావడంతో చూడడానికి రావడం జరిగింది . అడవిలో ఉండే జంతువు జనవాసాలకి మధ్యన రావడంతో అక్కడి ప్రజలు ఆసక్తిగా తిలకించారు . దానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా గ్రామస్తులు చర్యలు తీసుకున్నారు .కాగా గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు …ఫారెస్ట్ అధికారులకు సమాచారం జరిగిందని తెలిపారు.
అలుగు జీవి గురించి మీకోసం…
ప్రపంచంలో ఎనిమిది అలుగు జీవి జాతులుగా ఉన్నాయి. వాటిలో ఆసియా లో నాలుగు,ఆఫ్రికా లో నాలుగు జాతులు ఉన్నాయి. పలుగు జీవిలో ప్రతిదానికి ఎంతో విలువ ఉంటుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వివేక్ కోసం నల్లమల అడవులలో ఎక్కువగా వేటాడుతారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 50,000 అలుగులు వేటగాళ్ల చేతిలో మృతి చెందుతున్నట్లు సమాచారం. ఇందుకు కారణం లేకపోలేదు.బహిరంగ మార్కెట్లో దాని విలువ కోటి 50 లక్షల పై మాటే ఉంటుంది అని సమాచారం.
అలుగు మాంసం కిలో రూ.30 వేలు?పలుకుతుంది అని సమాచారం.
చైనా లో ఔషధ ప్రయోజనాల కోసం,ఆభరణాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాలెట్ల తయారీకి కూడా ఉపయోగిస్తారట.