నేటి గదర్ న్యూస్ : ఖమ్మం ప్రతినిధి:
✍️ సతీష్ కుమార్ జినుగు :
★వాట్సాప్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెజెన్సీ
ఈ మధ్యకాలంలో వాట్సాప్ ఓపెన్ చేయగానే మీ మొబైల్ ఫోన్ లోకి రైట్ సైడ్ ఓ డిఫరెంట్ కలర్లతో కూడిన సర్కిల్ కనిపిస్తుందా? అయితే మీరు కంగారు పడాల్సిన పనిలేదు. ఆ రింగు గురించి అవగాహన లేక అనేకమంది టెన్షన్ పడుతున్నారు. మీ టెన్షన్ ని నేటి గదర్ నివృత్తి చేస్తుంది.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. స్టార్టప్ కంపెనీలు మొదలు దిగ్గజ సంస్థల వరకు ఏఐని ఉపయోగిస్తున్నారు. చివరికి ఈ కామర్స్ సంస్థలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. ఇదిలా ఉంటే సోషల్ మీడియా సంస్థలు సైతం ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి.అయితే అందరూ ఎక్కువగా ఉపయోగించే వాట్సాప్ ఛానల్ అయినా మేట కూడా ఆర్టిఫిషల్ ఇంటెజెన్సీ ని విడుదల చేసింది.