★హైదరాబాద్ జెన్కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య
నేటి గదర్ న్యూస్,మణుగూరు రూరల్:పినపాక ,మణుగూరు సరిహద్దు మండలాల్లో నిర్మించిన 1080 మెగా వాట్ల విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్ కి సంబంధించిన విద్యుత్ అవుట్ ఫుట్ ట్రాన్స్ఫార్మర్లు పిడుగుపాటుకు గురై దగ్దమైన విషయం విధితమే.ఈ నేపథ్యంలో సంఘటనకు సంబంధించి థర్మల్ పాయింట్ ఉన్నతాధికారులు ఆదివారం ప్లాంటును పరిశీలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జెన్కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య,పలువురు అధికారులు సంఘటన జరిగిన ప్రాంతంలో సి సి ఫుటేజ్ లను పరిశీలించారు. పిడుగుపాటు దృశ్యాలను గుర్తించారు. అనంతరం వారు సంఘటన ప్రాంతంలో విలేకరులతో మాట్లాడుతూ పిడుగుపాటు మూలంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. వాటి విలువ రూ25 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా వేసినట్లు ఇంకా నష్ట తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. విద్యుత్ అవుట్ ఫుట్ ట్రాన్స్ఫార్మర్లు పిడుగుపాటుకు దగ్గు అవడంతో మొదటి యూనిట్ కి సంబంధించి 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగిందని, త్వరలోనే దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మత్తులు నిర్వహించి విద్యుత్తును పునరుద్ధరిస్తామన్నారు. ఈ సమావేశంలో బి టి పి ఎస్ సి ఈ బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు.