★పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం
జూలూరుపాడు, జూన్ 30, నేటి గద్దర్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లడి నరసింహారావు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కా ని మధిరలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామపంచాయతీలో పలు రకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి కి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 191