నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థులకు రోటరీ క్లబ్ వంటి అంతర్జాతీయ సంస్థలు అందించే అవార్డులు విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని, వాటిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎం. వెంకటేశ్వర చారి తెలిపారు.
రోటరీ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని పెన్షనర్స్ భవనంలో జరిగిన *రోటరీ యంగ్ ఎచివర్స్ అవార్డు* ప్రధాన వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వారు పదవ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అలాగే ఇన్స్పైర్ కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయికి ఎన్నికైన విద్యార్థులను అవార్డులతో సత్కరించడం అభినందనీయమని, వీరి సేవలు విద్యారంగం పట్ల మరింతగా పెరగాలని ఆకాంక్షించారు. మరొక అతిథి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ పి. రాధాకృష్ణమూర్తి గారు మాట్లాడుతూ నిరంతరం సమాజంలోని వివిధ రకాల వ్యక్తులతో కలిసి ఉండే తమకు విద్యార్థులతో కలిసి వాళ్లతో ముచ్చరించడం వారికి అవార్డులను ప్రధానం చేయటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి మరింత సేవ చేయాలని సూచించారు. అంతేగాక రోటరీ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వారు వివిధ రకాల వృత్తులలో ప్రతిభ కనబరిచిన ముగ్గురికి రోటరీ వోకేషనల్ ఎక్స్లెన్స్ అవార్డులను కూడా ప్రధానం చేశారు. అవార్డు గ్రహీతల వివరాలు:
*రోటరీ యంగ్ అచీవర్స్ అవార్డు*
1. పి భవ్య శ్రీ
2. ఎం మాధవి
3. కే హర్షిత
వీరు ఇన్స్పైర్ కార్యక్రమంలో జాతీయ స్థాయికి ఎన్నికైన విద్యార్థులు.
*10వ తరగతిలో ప్రతిభ కనపరచిన విద్యార్థులు:*
1. ఐ. నిహారిక -10 GPA
2. కే. జ్యోతి చందు-10 GPA
3. జి. దీక్షిత – 9.8 GPA
4. జి షారోన్ సోఫియా- 9.8 GPA
5. యు. దరహాసిని- 9.8 GPA
6. డి. సుభాష్ కుమార్ -9.8 GPA
*రోటరీ వోకేషనల్ ఎక్స్లెన్స్ అవార్డు పొందినవారు*
1. శ్రీ ఎస్. కే. రియాజ్ – రోటరీ లింబ్ సెంటర్ టెక్నీషియన్
2. శ్రీ పార్టీ రవి. బసవతారకం కాలనీ గ్రామపంచాయతీ శానిటరీ వర్కర్
3. సోమయాజుల శారద,- యోగా ట్రైనర్
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు శ్రీమతి పోసాని అరుణ, కార్యదర్శి పి. సుజాత, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జే. అబ్రహం, అసిస్టెంట్ గవర్నర్ శ్రీ ఎస్. సత్యనారాయణ, ఒకేషనల్ డైరెక్టర్ ఏ. నాగరాజశేఖర్, క్లబ్ ట్రైనర్ యు. ఆనంద కుమార్, సీనియర్ రొటేరియన్ ఏ. పాపన్న, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.