పి. డి. ఎస్. యూ , పి. వై. యల్ ఖమ్మం జిల్లా కమిటీ
25 రోజులు గడుస్తున్నా నీట్ విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా, మొండిగా వ్యవహరిస్తుందాని
నీట్ సమస్య పై అనేక సార్లు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా లో రాష్ట్ర లో దేశ వ్యాప్తంగా నిరసనలు వేలువడుతున్న చీమకుట్టి నట్టు కూడా లేదు అని అందుకే రేపు జూన్ 1 న విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి జయప్రదం చేయాలనీ పి. డి. ఎస్. యూ, పి.వై.యల్. ముఖ్యల సమావేశంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి. డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వి. వెంకటేష్ ప్రగతి శీల యువజన సంఘం పీ. వై. యల్ రాష్ట్ర నాయకులు సురేష్ లు పాల్గోని ఒక ప్రకటన లో తెలిపారు..
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
దేశంలోని వివిధ బిజెపి పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ జరిగిందని దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, మేధావులు ప్రజాస్వామ్యవాదులు ఉద్యమిస్తున్నారు. ఈ పేపర్ లీకేజీ, స్కామ్ ద్వారా 24 లక్షల మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నా కూడా దీనిలో లక్షలాదిమంది తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి గవర్నర్ మరియు కేంద్ర మంత్రులుగా, ఎంపీలు కూడా ఇంతవరకు కనీసం స్పందించకపోవడం ఏంటని వారు వారిని ప్రశ్నించారు.
గత 20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాలు ఐక్య కార్య చరణ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తు,దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నా కేంద్రం మంత్రులు తెలుగు నీట్ యూజీ బాధిత విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య, మొండి వైఖరిని నిరసిస్తూ జూలై 1న రాజ్ భవన్ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు T లక్ష్మణ్ పి.వై.యల్ ఖమ్మం నగర ప్రధాన కార్యదర్శి M రవీందర్ గుండేటి అశోక్ ,పి. డి. ఎస్. యూ నాయకులు పృథ్వి, ప్రసాద్, వెంకటేష్, మాల్సర్ తదితరులు పాల్గొన్నారు.