+91 95819 05907

తమ స్నేహితుడు ఎన్ఆర్ఐ ని కలిసిన తన చిన్ననాటి స్నేహితులు

★ఆ దంపతులకు శాలువా తో సత్కారం
★ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే ఎన్నారై కునారపు ప్రసాద్ ఆదర్శం
★చిన్న నాటి స్నేహితులు
నేటి గదర్ ,పినపాక. జూన్ 30: దోస్త్ మేరా దోస్త్ తు హై మేరీ జాన్ వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం రాసారు స్నేహం కోసం అనే లిరిక్స్ సినీ రచయిత భువన చంద్ర. దాని గురుతు చేస్తూ… ఎల్లలు దాటుకోని
యూఎస్ నుండి స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఎన్ఆర్ఐ కూనారపు ప్రసాద్ తన స్వగ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగూడెం పంచాయతీ గోపాలరావుపేటలో వారి ఇంట్లో చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇండియాకి తిరిగి వచ్చిన ప్రసాద్ దంపతులకు స్నేహితుల శుభాకాంక్షలు తెలిపి గిఫ్ట్లు అందించారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ప్రసాద్ స్నేహితులు తమ బాల్య జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. తమలాగే ఆటలు పాటలలో ముందుండే ప్రసాద్ చదువులో కూడా అంతే ఇష్టంగా చదివే వారిని గుర్తు చేశారు. ఆ రోజుల్లో కష్టమైన ఎంట్రెన్స్లు రాసి సీట్లు సాధించారని గుర్తు చేసుకున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత చదువులు పూర్తి చేసి ఆ రోజుల్లో అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లారని గుర్తు చేశారు. అక్కడ సైతం తను జాబ్ చేస్తూనే ఓ కంపెనీ నెలకొల్పి మరి కొంతమందికి తన కంపెనీలో ఉపాధి కల్పిస్తున్న ఎన్ఆర్ఐ కూనరపు ప్రసాద్ దంపతులు ఆదర్శమన్నారు. అలాగే మాతృదేశంపై ప్రేమతో ఇండియాకు వచ్చిన ప్రతిసారి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం చేసే మానవతా మూర్తి ప్రసాద్ తమ స్నేహితుడు కావడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు . అలాగే తమ స్నేహితులలో ఒకరైన ప్రసాద్ ఉన్నత చదువులు చదువుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్న తమ స్నేహితుని విజయ గాథ ని తమ పిల్లలకు సైతం నూరిపోవడం జరుగుతుందని తెలిపారు. డబ్బులు సంపాదిస్తే తల పొగరున్న నేటి రోజుల్లో NRI కూనరపు ప్రసాద్ ఇండియా కు వచ్చిన ప్రతి సారి తన చిన్ననాటి దోస్తులను కలిసి వారో తో ఓ రోజు కలిసి అందరూ కలిసి చిన్ననాటి స్మృతులను నెమర వేసుకుంటామని తెలిపారు. అంతటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తమ స్నేహితుడు కావడం గర్వకారణం అన్నారు. తమ స్నేహితుడు NRI ప్రసాద్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు నిమ్మ లింగారెడ్డి,బండారు నరేంద్ర, చిర్రా ఉప్పలయ్య, కొంపెల్లి మల్లేష్, శ్రీనివాస్, నట్టి వీరబాబు. ఓలాద్రి రాజిరెడ్డి, భాగి అశోక్. పూస శ్రీను. సృజన. తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 10

Read More »

 Don't Miss this News !