★ రాష్ట్ర వ్యాప్తంగా2.20 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్
★జూన్29న కలెక్టర్లతో వి సి నిర్వహించిన భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్
ఐన ధరణి సమస్యలు ఇకనైనా తీరేనా..?
★పట్టా పాస్ బుక్ కోసం ఏళ్లుగా ఎదురు చూపులు..
★పెట్టుబడి సాయం కోల్పోతున్న వేల మంది రైతులు..
★ రెవెన్యూ శాఖలో వేగం పెరిగేనా?
నేటి గదర్ న్యూస్ ,జులై 1 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
సొంతగా భూమి ఉంది.. ఏళ్లనాటి నుండి సాగు చేస్తున్నారు.. అయిన పట్టా పాస్ బుక్ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా ప్రదిక్షణలు చేస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు పట్టా రావడం లేదో తెలియదు.. అధికారులను అడిగితే స్పష్టమైన సమాధానాలు చెప్పరు.. చేసేదేమీ లేక ఊరిలోని చోట, బడ నాయకుల ను ఆశ్రయిస్తున్నారు. అయినా పట్టా పాస్ బుక్ రాకా ఏళ్ల నాటి నుండి ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం కోల్పోతున్న రైతులు ఎందరో.. దీనంతటికీ కారణం రెవెన్యూ అధికారులు,వారి నిర్లక్ష్యం కారణంగా రైతులు ప్రభుత్వం అందించే సాయం ,మరోపక్క బ్యాంక్ ల నుండి రుణాలు పొందలేక పోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ధరణి కష్టాలను తీర్చుతాం అని హామీ ఇవ్వడంతో కోటి ఆశలతో కొత్త పట్టా కోసం ఎదురు చూస్తున్నారు. ధరణి సమస్యలను పరిష్కరించడం కోసం అధికారులు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుండి వినతులు స్వీకరిస్తున్నారు. ఇకనైనా తమకు కొత్త పట్టా పాస్ బుక్ వస్తుందని ,రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుండి పెట్టుబడి సాయం పొందోచ్చని ఆశలు చిగురించాయి. అధికారులు కూడా రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. చూడాలి ఇకనైనా రైతుల కష్టాలు తీరుతాయా ..?లేదా? అని..