– వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్న ప్రజా ప్రభుత్వం
– జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు శుభా కాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క గారు
నేటి గదర్, జులై 01:
ములుగు జిల్లా ప్రతినిధి,
కౌశిక్ కుక్కల, 6281272659:
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారన్న డాక్టర్లు బాధలనుంచి, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లు అని మంత్రి సీతక్క కొనియాడారు. కరోనా సహా అన్ని ఆరోగ్య విపత్తుల కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని అన్నారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కునే క్రమంలో తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి రోగులకు సేవలందించిన ప్రతి డాక్టర్‌కు, వారికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు.. పేరు పేరునా మరోసారి అభినందిస్తున్నానని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు
రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఈ సందర్భంగా మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్జంలో, వైద్య నారాయణులై తమవంతు పాత్రను పోషించాలని వైద్యులను కోరారు. ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని రాష్ట్రంలోని ప్రతీ వైద్యునికి మంత్రి వర్యులు సీతక్క గారు పిలుపునిచ్చారు.
అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో మౌలిక వసుతులను మరింత మెరుగు పరిచామన్నారు.
ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని తెలుపుతుందన్నారు. రానున్న కాలంలో ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. ఈ క్రమంలో డాక్టర్లు, నర్సులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంక్షేమం కోసం, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వర్యులు సీతక్క ఉద్ఘాటించారు.