★చెయ్యెత్తి నిలబడితే గుడిసె కప్పు అందుతుంది…
★వర్షం వస్తె చాలు సట్లు ,సరవలు పెట్టాల్సిందే..
★మొదటి విడతలో ఇళ్ల కోసం దళితుల ఎదురు చూపు..
★మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తమ బాధను వ్యక్తం చేస్తూ వేడుకోలు..
నేటి గదర్ న్యూస్ ,జులై 1 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
పేదోడికి సొంత ఇళ్లు ఒక కల.. ఇల్లు కట్టుకోవడం కోసం తన జీవితాంతం అహర్నిశలు కష్టపడిన ఇల్లు కట్టుకోలేక సొంత ఇల్లు కలగానే మిగిలిపోతుంది… కొందరు అప్పులు చేసి అయినా కట్టుకోవాలి అనుకుంటారు.. కొంత మందికి ప్రభుత్వాలు ఇల్లు కట్టించి ఇచ్చి సొంతింటి కలను నిజం చేస్తాయి..కానీ సొంత ఇల్లు ఉండి కూడా అవస్థలు పడుతున్న పేదలు ఉన్నారు… వారే కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో దళిత కాలని వాసులు.. వారికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లులు కట్టించి ఇచ్చింది.. ఇందిరమ్మ ఇల్లుల నిర్మాణ సమయంలో అప్పటి గుత్తేదారు కాసులకు కక్కుర్తి పడి సరైన నాణ్యత లేకుండానే, కనీసం బెస్ మట్టం ఎత్తు , లోపలో సన్నసైడ్ ,ఇంటికి ప్లాస్టింగ్ లేకుండానే కట్టించి పేదలకు కట్టబెట్టారు.. పట్టుమని 30 ఏళ్లు కూడా దాటకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి.. ఇప్పుడు ఆ ఇళ్లలో ఉంటున్న ఆ దళితుల పరిస్థితి చెప్పితే గుండె తరుక్క పోతుంది.. శిథిలావస్థకు చేరిన ఇళ్ళల్లో ఉంటున్న వారు బిక్కు బిక్కు మంటూ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇళ్ళల్లో స్లాబ్ పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు మీద పడతాయో తెలియక రాత్రులు నిద్రపోవాలంటే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఇల్లు కురుస్తున్నాయి. కురుస్తున్న వర్షపు నీటిని పట్టడం కోసం సరవలు , సట్లు పెట్టాల్సిన పరిస్థితి . మనిషి నిలబడి చెయ్యెత్తితే స్లాబ్ అందుతుంది. ఎప్పుడు గోడలు ,స్లాబ్ కులుతాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకు సాగిస్తున్నారు.. దళిత కాలని వాసులు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే ఇందిరమ్మ ఇళ్ళకు మొదటి విడతలోనే ఈ దళితులకు అందరికీ ఇళ్లులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీ వేడుకుంటున్నారు. తమ బాధను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి అధికారులు తీసుకెళ్ళేలా ఒకసారి ఇళ్లను సందర్శించాలని కోరుతున్నారు.