+91 95819 05907

మాట తప్పితే పోరాటం తప్పదు సీఐటీయూ (CITU)

◆అంగన్ వాడీల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కి సంబంధించి
ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

నేటి గదర్ న్యూస్,చర్ల:

అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి, జులై 24 తర్వాత ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి అని
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు చర్ల ప్రాజెక్టు కమిటీ డిమాండ్ చేసింది .రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క టీచర్ కు రెండు లక్షలు హెల్పర్పు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని వాగ్దానం చేశారని ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పోరాటం తప్పదని సిఐటియు పేర్కొన్నది .
రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా సర్కులర్ ఇచ్చి 65 సంవత్సరాలు నిండిన వారిని బలవంతంగా ఇంటికి పంపించే కార్యక్రమాన్ని నిరసిస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చర్ల ప్రాజెక్టు ఆఫీసర్ సిడిపిఓ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1 లక్ష చెల్లించాలి. vrs సౌకర్యం కల్పించాలి.

తెలంగాణ రాష్ట్రంలో 65 సంవత్సరాలు పూర్తయిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సుమారు 10 వేల మంది పనిచేస్తున్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజులు అంగన్వాడి ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశారు. ఈ సమ్మె సందర్భంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ కు 2 లక్షలు హెల్పర్స్ కు 1 లక్ష పెంచుతామని, పెన్షన్ విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అనంతరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ ఉద్యోగుల స్థితిగతులు, గత 24 రోజులు సమ్మె జరిగిన పరిస్థితి, ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, హామీల్లో ఒకటైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి కూడా వివరంగా ప్రభుత్వం ఐసీడీఎస్ మంత్రి మరియు ఐసీడీఎస్ రాష్ట్ర అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకువచ్చాము. అయినా పై అంశాలను పరిగణలోకి తీసుకోక పోవడం అన్యాయం. పైగా రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మనోభావాలకు వ్యతిరేకంగా, ఏకపక్షంగా అతి తక్కువ డబ్బులు చెల్లించి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ను జులై 4 తర్వాత ఇంటికి పంపించాలని నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్గం. అంగన్వాడీ ఉద్యోగులకు తీవ్రమైన నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి.

అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు ముందు గత బిఆర్ఎస్ ప్రభుత్వం go no 10 ని జారీ చేసింది. దీని ప్రకారం టీచర్స్ కు 1 లక్ష, హెల్పర్స్ కు 50 వేలు ఇస్తామని నిర్ణయం చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ 24 రోజులు నిరవధిక సమ్మె చేశారు. ఈ సమ్మె సందర్భంగా అక్టోబర్ 4న గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇతర హామీలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1 లక్ష పెంచుతామని,vrs సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్రంలో నిరవధిక సమ్మెను విరమించారు. ఈ అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలించకుండా పక్కన పెట్టడం సమంజసం కాదు.పైగా అంగన్వాడీ ఉద్యోగులు వ్యతిరేకించిన పాత go no 10 నీ అమలు చేయాలని చూడటం అన్యాయం.

పాత go no 10 ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ మొదటి వారంలో సర్క్యులర్ ను జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు పోరాటాలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం జూన్ 7 న ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో అంగన్వాడీ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ డైరెక్టర్ గారితో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఐసిడిఎస్ డైరెక్టర్ గారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కోరుకుంటున్న విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని,vrs సౌకర్యం కల్పించాలని,అంగన్ వాడీ ఉద్యోగులకు సానుకూలంగా ప్రభుత్వానికి ఫైల్ పెడతామని ఐసీడీఎస్ డైరెక్టర్ గారు హామీ ఇచ్చారు. జూన్ 17న ఐసిడిఎస్ మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లా వెళ్లిన సందర్భంగా అక్కడ అంగన్వాడి యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంత్రి గారిని కలిసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1 లక్ష పెంచుతూ సంతకం చేశానని మంత్రి తెలియజేశారు. ఐసిడిఎస్ రాష్ట్ర అధికారులతో పాటు,మంత్రిగారు కూడా సానుకూలంగా స్పందించడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయని, విఆర్ఎస్ సౌకర్యం వస్తుందని రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ , హెల్పర్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మళ్లీ పాత go no 10 ప్రకారం అతి తక్కువ డబ్బులు చెల్లించి జూలై 24 తర్వాత ఇంటికి పంపిస్తామని నిర్ణయం చేయడం అంటే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ ,హెల్పర్స్ ను మోసం చేయడం తప్ప మరొకటి కాదు.

కావున పై అంశాలు పరిశీలించాలని అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ కు నష్టం కలిగించే go no 10ని రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1 లక్ష పెంచుతూ కొత్త జీవో ను జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు చర్ల ప్రాజెక్టు కమిటీ నాయకురాళ్ళు స్వరూప,రాణి,సుజాత,శమంతకమణి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 18

Read More »

 Don't Miss this News !