+91 95819 05907

విద్యార్థుల కు దుప్పట్లు, ప్లేట్లు,గ్లాసులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

★నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి
★ వసతుల కల్పనలో రాజీ ఉండొద్దు.
★ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్య.
★నాణ్యమైన ఆహారం అందించాలి
★పినపాక ఎమ్మెల్యే పాయం

నేటి గదర్ న్యూస్,పినపాక:

పినపాక మండలంలోని ఎల్చిరెడ్డిపల్లి కస్తూర్భా , బాలికల ఆశ్రమ పాఠశాలలను పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడారు. విద్య వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, వసతుల ఏర్పాట్ల లో రాజీ పడేది లేదని , ఇబ్బందులు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్తు అందించాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం తయారు చేసిన ఆహారాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతోందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరిపడా నాణ్యమైన భోజనం పెట్టాలని హెచ్ ఎం ని ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని భోజనశాల, విద్యార్థుల వసతి గదులను పరిశీలించి, గదుల్లో ప్యాన్ లు, లైట్ లు పనిచేయకపోవడంతో వెంటనే రిపేర్ చేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎల్చిరెడ్డిపల్లి
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే పాయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం తయారు చేసిన ఆహారాన్ని పరిశీలించారు. మొత్తం ఎంతమంది విద్యార్థులకు భోజనం తయారు చేశారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరిపడా నాణ్యమైన భోజనం పెట్టాలని హెచ్ ఎం ని ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని భోజనశాల, విద్యార్థుల వసతి గదులను పరిశీలించి, గదుల్లో ప్యాన్ లు, లైట్ లు పనిచేయకపోవడంతో వెంటనే రిపేర్ చేయించాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ను ఇస్తోందని, పేదరికం కారణంగా ఎవరూ విద్య కు దూరం కాకూడదని సూచించారు. వానా కాలం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వారం పాఠశాలల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి, విద్యార్ధుల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. వసతుల కల్పనలో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని , పాఠశాలలు, హాస్టల్ ప్రాంగణాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం పాఠశాలల అవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. నాటిన మొక్కలను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీ సీ డీ ఓ అన్నమణి, ఎంపిడిఓ రామకృష్ణ, ఎంపీఓ కే. వేంకటేశ్వరరావు, ఎం ఈ ఓ వీరాస్వామి, ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ విజయ్ కృష్ణ, కస్తూర్బా పాఠశాల యస్ ఓ స్రవంతి , తదితరుల పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 3

Read More »

మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే.

★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ? ★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో ★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి ★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ

Read More »

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

 Don't Miss this News !