విద్యా సంస్థల బంద్ ను జయప్రదం చేయండి.
ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ లు పిలుపు
జూలూరుపాడు, జులై 03, నేటి గద్దర్ : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జూలూరుపాడు మండల కమిటీలు రేపటి దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జమ్మి యశ్వంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీ మాట్లాడుతూ జూలై 4న దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ) రద్దు చేయాలని, నీట్ -2024 తిరిగి నిర్వహించాలని, మెడికల్ సీట్ల భర్తీ, ప్రవేశాలు రాష్టాలకు వదిలేయాలని, రాష్ట్రంలో పాఠశాలల మూసివేతని ఆపాలని, నీట్ పరీక్ష అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వవిద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 7000 కోట్ల రూపాయల స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. బందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సహకరించాలని కోరారు.