★ప్రత్యేక మహాజన సమావేశంలో రైతుల సూచన
నేటి గదర్ న్యూస్, మణుగూరు రూరల్: ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి పరిమితి నిబంధన లేకుండా గిరిజన గిరిజన రైతుల సాగు భూములు పోడు భూములకు రైతు భరోసా పథకం అమలు చేయాలని గిరిజన, గిరిజనేతర రైతులు కోరారు.
మణుగూరు సొసైటీ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరావు ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక మహాజన సభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం మణుగూరు మండలం గుట్ట మల్లారం రైతు వేదికలో అధికారులు నిర్వహించారు. ఈ సభలో మణుగూరు మండలం సంబంధిత రైతులు పాల్గొన్నారు. యాక్ట్ ఉన్న ప్రాంతంలో గిరిజన, గిరినేతర లకు ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందాలని అధికారులకు అభిప్రాయాన్ని అధిక సంఖ్యలో రైతులు తెలిపారు. రైతు భరోసా ఇచ్చే బదులు పంటకు గిట్టుబాటు ధర ఎక్కువ కల్పిస్తే బాగుంటుందని రైతులు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా సహకార అధికారి. ఎస్డి కృషిద్, వ్యవసాయ అధికారి ,డి. తాతారావు,ఏవో. పి రామశివరావు. జిల్లా ఎంపీటీసీల అధ్యక్షుడు గుడి పూడి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు దొండేటి రామ్మోహన్రావు, కే రమేష్ , సంఘ సీఈఓ జ్ఞాన దాసు , సంఘ డైరెక్టర్లు పాల్గొన్నారు.