★నాడు పాలేరు నవోదయ లో సీటు
★నేడు JNV దక్షణ ఫౌండేషన్ లో సీటు సాధించాడు
★తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోనే ర్యాంక్
★మంగళగిరి షణ్ముఖ సాయి
★ఆ విద్యార్థి ని పలువురు అభినందించారు
నేటి గదర్ న్యూస్, పినపాక: చదువుకోవాలనే పట్టుదల… అమ్మానాన్నలు,కుటుంబ సభ్యులు , ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆ యువకుడు దేశంలోని అత్యుత్తమ కళాశాలలో సీటు సాధించారు. అందరిచే శభాష్ అనిపించుకుంటున్న సరస్వతి పుత్రుడు.వివరాలు…
పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు కు చెందిన మంగళగిరి సింగరయ్య,మమత ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో శ్రీ జై సాయి బుక్ స్టాల్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు వారి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఈ క్రమంలోనే వారి మొదటి సంతానం కూతురు తొలుత నవోదయ లో సాధించింది… ఆమె స్ఫూర్తితో వారి మూడవ సంతానం షణ్ముఖ సాయి నవోదయలు సీటు సాధించాడు.2024 SSC ఫలితాల్లో (సెంట్రల్ సిలబస్) లో అత్యుత్తమ పర్సంటేజ్ మార్కులు సాధించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని నవోదయ పాఠశాల లో 10 వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కొరకు JNV దక్షిణ ఫౌండేషన్ సారథ్యంలో పరిమిత సీట్ల కొరకు దక్షన్ కళాశాల కు ఎంట్రెన్ టెస్ట్ నిర్వహించారు. గత కొద్ది రోజుల క్రితం ఫలితాలు వెలుపడ్డాయి. కేరళ రాష్ట్రం లో సీటు సాధించారు.మంగళగిరి షణ్ముఖ సాయి మెరుగైన ర్యాంకు సాధించి కేరళ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక దక్షన్ కళాశాలలో సీటు సాధించారు. ఈ కాలేజీలో ఇంటర్ విద్యతో పాటు jee/Neet కు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. నాడు నవోదయ పాఠశాలల్లో సీటు సాధించడం…నేడు దక్షన్ కళాశాలలో సీట్ సాధించిన సరస్వతి పుత్రుడు…
మంగళగిరి షణ్ముఖ సాయి ని నవోదయ పాలేరు పాఠశాల ప్రిన్సిపాల్ కే శ్రీనివాసులు, పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
◆◆◆◆◆◆●●●●●●. ◆◆◆◆◆◆◆●●●
చివరగా షణ్ముఖ సాయి మాట్లాడుతూ తల్లిదండ్రులు, తాను చదువుకున్న పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సవంతోనే ప్రతిష్టాత్మక లక్ష్యం కళాశాలలో సీటు సాధించానని తెలిపారు. ఐఏఎస్ సాధించడమే తన జీవిత లక్ష్యమని తెలిపారు. అల్ ది బెస్ట్