నేటి గదర్ న్యూస్,చర్ల:
చర్ల మండలం సత్య నారాయణ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బట్టి గూడెం, బత్తిన పల్లి గ్రామాలలోవైద్యాధికారి
దివ్య నయన అధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.బట్టిగూడెం లో ముగ్గురు జ్వరం తో ఇబ్బంది పడుతుండగా వారికి మలేరియా కు సంబంధించిన RDT టెస్టు లు చేసినట్లు.. వారందరికి వైరల్ జ్వరం గా గుర్తించి వారికి మందులు ఇవ్వటం జరిగిందని వైద్యురాలు దివ్య నయన తెలిపింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.నీటి నిల్వ లేకుండా చూడడం,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,జ్వరాలు వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యశాల కి రావాలని సూచనలు చెయ్యడం జరిగింది.కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని,
దోమతెరలు తప్పనిసరి గా కట్టుకోవాలని సూచించారు.ఈ శిబిరంలో 3+4 గర్భిణీ స్త్రీలను పరీక్షలు చేసి వారిని నెల,నెల ఆరోగ్య కేంద్రం కి రావాలని చెప్పడం జరిగింది.చిన్నపిల్లలకు వారికి వయస్సు కి తగ్గట్లుగా టీకాలు వేయించుకోవాలని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో. డి.పి.ఎం.ఓ సత్య నారాయణ,హెచ్.ఈ.ఓ బాబురావు,MLHP లు
సంధ్య, పార్వతి,దీప్తి మౌనిక,
హెల్త్ అసిస్టెంట్లు
వరప్రసాద్,సుబ్బారావు,వేణు ఆశా కార్యకర్త జోగమ్మ
తదితరులు పాల్గొన్నారు.