+91 95819 05907

ఆ ఐదు పంచాయతీలపై ‘పొదెం’ పట్టు…

◆ తెలంగాణలోని భద్రాచలం రెవెన్యూ డివిజన్ లో కలపాలసిందే

◆సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ను కలిసిన పొదేం వీరయ్య

◆ఇద్దరు సీఎంల భేటీ నేపథ్యంలో
ఆ ఐదు పంచాయతీలతోనే పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం

◆సీఎం, డిప్యూటీ సీఎం లకు కు విన్నవించిన పొదెం

– *సానుకూలంగా స్పందించిన సీఎం, డిప్యూటీ సీఎం లు*

– *కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఐదు గ్రామ పంచాయతీల వ్యవహారం*

– *పొదెం ముందడుగుపై సర్వత్రా హర్షాతిరేఖాలు*

నేటి గదర్ న్యూస్, భద్రాచలం :

ముంపు విభజన నేపథ్యంలో ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలుపుతూ తెలంగాణకు తీసుకురావాలని ఏఐసీసీ మెంబర్, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు, భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హైదరాబాదులో కలిసి విన్నవించారు. ఈ మేరకు పొదెం వీరయ్య గారు సీఎంకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ని కూడా కలిసి వినతిపత్రం సమర్పించారు.

భద్రాచలంకు చెందిన ఆంధ్రాలో కలిపిన ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల తదితర గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలం మండలంలో చేర్చాల్సిన అవసరం ఉందని సీఎంకు తెలిపారు. భద్రాచలం పట్టణం తప్ప, పట్టణాన్ని ఆనుకొని ఉన్న రూరల్ ప్రాంతమంతా ఆంధ్రాలో కలవటం వల్ల పుణ్యక్షేత్రంలో భూ సమస్య ఏర్పడిందని, కనీసం చెత్త వేసుకోవటానికి కూడా స్థలంలేని పరిస్థితి నెలకొందని ఈ ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలిపితే స్థల సమస్య పోయి పుణ్యక్షేత్ర ప్రగతి సాధ్యమవుతుందని వెల్లడించారు.

ఈ ఐదు పంచాయతీలు ఆంధ్రాలో ఉండటం మూలంగా, భద్రాచలానికి, తెలంగాణకు సరిహద్దు సమస్యల చిక్కులు కూడా వస్తున్నాయని, ఈ ప్రాంత ప్రజలందరూ ఎన్నో రోజులుగా తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి పొదెం వీరయ్య గారు తీసుకొచ్చారు.

దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న, శ్రీ సీతారామచంద్రస్వామి వారు నడిగాడిన పుణ్యభూమిగా కొలవబడుతున్న భద్రాచల పుణ్యక్షేత్రం ప్రాధాన్యత దృష్ట్యా జూలై 6న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఈ విషయంపై చర్చ జరిపి భద్రాచలానికి మేలు చేసేలా సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని పొదెం ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంను కోరారు.

పొదెం సూచనను స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గార్లు సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా పొదెం వీరయ్య గారు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఇదిలా ఉండగా… ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో భద్రాచలానికి చెందిన ఈ ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కలుపుతామన్న హామీ పేర్కొనబడింది.ఈ నేపథ్యంలో ఈ ఐదు గ్రామపంచాయతీలు తెలంగాణలోకి మళ్లీ తీసుకురావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారిని పొదెం వీరయ్య గారు కలిసి ఈ సమస్యను నివేదించటం పట్ల స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కలపాలని ఆది నుంచి ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ఆనాడు భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా వీరికి మద్దతు తెలుపుతూ ముందంజలో ఉండి పొదెం వీరయ్య గారు పోరుబాటలో నడిచారు.గతంలో అనేక ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో… రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న ఐదు గ్రామపంచాయతీల వ్యవహారం తేల్చాలని, పుణ్యక్షేత్రం భద్రాచలానికి న్యాయం చేయాలని కోరుతూ…పొదెం వీరయ్య గారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారిని కలవడం స్థానికుల్లో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రజా సేవకులు అంటే, ప్రజా నేతలు అంటే పొదెం వీరయ్య గారిలా… పదవున్నా లేకున్నా… ప్రజల మధ్య ఉండేలా ఉండటం తమ అదృష్టం అంటూ… స్థానికులు పొదెం ఈ ఐదు గ్రామపంచాయతీల వ్యవహారంపై ముందు అడుగులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 18

Read More »

 Don't Miss this News !