నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి :
✍️ సతీష్ కుమార్ జినుగు : ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాలో ఏమ్ జరుగుతుంది. రైతుల ప్రభుత్వంలో రైతులకు ధైర్యంగా బ్రతికే హక్కు లేదా.ఇలాంటి ఆత్మహత్య లు ఇంకా ఎన్ని చూడాలి.ప్రభుత్వలు చొరవ చూపావా.అధికారులు, ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరేతినట్లు చూస్తూ ఉండటం తగదు అని ఖమ్మం జిల్లా ప్రజలు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి ఉన్న జిల్లాలో రైతులకు తమ భూమి తాము సాగుచేసుకొనే హక్కు లేకపోవటం దారుణం అని ప్రజలు వాపోతున్నారు.నిన్న చింతకాని మండలంలో ఒక రైతు సెల్ఫీ తీసుకొంటూ తన భూమి ఆక్రమించారు అని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే, ఇ రోజు మరొక రైతు తన భూమి ఆక్రమించారు అని తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవటం జిల్లా ప్రజలను కలిచివేస్తుంది.
కారేపల్లి మండలం ఆలియా తండా గ్రామంలో తన భూమిని ఆక్రమించారని పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోవటం జరిగింది.
బాధిత రైతు పచ్చిపాల భద్రయ్య పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవటం తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే
ఇల్లందు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ అక్కడ సరియైన వైద్య సదుపాయం లేక వెంటనే అక్కడ నుంచి ఖమ్మం ఆసుపత్రికి తరలించరు.కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.కనీసం ఖమ్మం జిల్లా లో జరుగుతున్న రైతు ఆత్మహత్య ల గురించి ఇటు అధికారులు, ప్రజ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపి భాద్యలు పై చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పొనరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.