ఫోటో మీది… వార్త ప్రచురణ నేటి గదర్ ది…9581905907
★అసిస్టెంట్ డాక్టర్, సోషల్ యాక్టివిస్ట్:గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి
సెల్: 81794 14327
భద్రాచలం డివిజన్కు ఐదు పంచాయతీలను కలపకుండా, భద్రాచలం డివిజన్లో ఉన్న ఐదు మండలాలను,
ఆంధ్రాలో కలిపి…..
వాజేడు నుంచి భద్రాచలం వరకు
భద్రాచలం నుంచి కుక్కునూరు వరకు
భద్రాచలం నుంచి చింతూరు వరకు
ఒక జిల్లాగా భద్రాద్రి జిల్లాగా ఏర్పాటు చేస్తే భద్రాచలానికి మరియు చుట్టుపక్కల మండలాలకు అభివృద్ధి జరుగుతుందని, ఎంతోమంది నిరుద్యోగ యువత మరియు విశ్లేషకులు, వ్యాపారవేత్తలు, గిరిజనులు, అందరూ కూడా అనుకుంటున్నారు. అలాగే ఐటీడీఏ కు తగ్గిన ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు, ముఖ్యంగా
వాజేడు నుంచి భద్రాచలం వరకు, చింతూరు నుంచి భద్రాచలం వరకు, కుక్కునూరు నుంచి భద్రాచలం వరకు, ఒకప్పుడు భద్రాచలం ఐటీడీఏలోనే సమస్యల పరిష్కారం జరిగింది మరియు వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం, చింతూరు, ఎటపాక, నెల్లిపాక, ఎడుగురాళ్లపల్లి, మరియు కుక్కునూరు మండలాల ప్రజలు నిత్యం ఏదో ఒక అవసరం కోసం భద్రాచలం వస్తూ ఉంటారు. వారికి భద్రాచలం సుపరిచితం అన్ని విషయాలలో విద్య, వైద్యం, వ్యాపారం అన్ని విషయాలలో భద్రాచలం అందరికీ హబ్ గా ఏర్పడింది, కావున భద్రాద్రి జిల్లాగా భద్రాచలాన్ని పూర్వం భద్రాచలంలో ఉన్న మండలాలని కలిపి భద్రాచలం ఆంధ్రలో కలిపి భద్రాచలం భద్రాద్రి జిల్లాగా మారి అభివృద్ధి చెందేలాగా, చేయాలని ఆశిస్తున్నాము .గోదావరినే రాష్ట్రాల సరిహద్దుగా మార్చి చిన్నాభిన్నమైన రాష్ట్రాల చిత్రపటాలను ఒకదాటికి తీసుకురావాలి.భద్రాచాన్ని కి మెడికల్ కాలేజ్, రైల్వే స్టేషన్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా ఎన్నో అభివృద్ధి చెంది సంస్థలను ఏర్పాటు చేసి భద్రాచలం సమీపంలో ఉన్న ఆదివాసి మరియు మూలవాసి గిరిజన, గుండు, బంజారా, తెగలను ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ అభివృద్ధి కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కలిపి భద్రాచలాన్ని భద్రాద్రి జిల్లాగా మార్చితేనే జరుగుతుందని ఆశిస్తున్నాo.
ఇట్లు భద్రాచలం డివిజన్ వాసులం…….