డ్రైనేజీ మట్టి పోశారు:గ్రామస్థులు
మా గోస ఎవరికి పట్టదా?
నేటి గదర్ న్యూస్, పినపాక:గతంలో ఆ సందు రోడ్డు లో నడవాలి అంటే ఆ విధి వాసులకు నరక ప్రయసే.వారి కష్టాలను చూసి సీసీ రోడ్డు వేశారు. కష్టాలు తీరాయి అనుకున్నాను కానీ అధికారుల నిర్లక్ష్యం మళ్ళీ కొత్త కష్టాలు తెస్తాయా అనుకోలేదు.వివరాలు… పినపాక మండలం భూపాలపట్నం గ్రామపంచాయతీ భూపాలపట్నం లో ఆ గ్రామ చెరువుకు వెళ్లే వీధి CC రోడ్డు దారుణంగా తయారైంది. ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో డ్రైనేజీ నుండి తీసిన పూడిక మట్టి ఆ సిసి రోడ్డుపై అడ్డంగా పోసారు. ఎందుకు పోసారో తమకు అర్థం కావడం లేద ని ఆ వీధి వాసులు నేటి గదర్ కి తెలిపారు. వృద్ధులు పిల్లలు మహిళలు ఆ రహదారిపై నడవాలంటేనే నరకయాతన అనుభవిస్తున్నారని… జిగురు మట్టి మూలంగా కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు దృష్టి సారించి తక్షణమే సిసి రహదారిపై పోసిన మట్టిని తొలగించి తమ సమస్యకు పరిష్కారం చూపించాలని ఆ వీధి వాసులు కోరుతున్నారు.