నేటి గదర్, జూలై 08,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శ్రీరాములు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విధితమే. చావు బ్రతుకులతో పోరాడుతూ ఎస్సై శ్రీరాములకు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతుంది. అయితే ఆయన ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలపై, ఆయనను ఇబ్బందులకు గురిచేసి ఒత్తిడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఐ భార్య శ్రీరాములు కృష్ణవేణి హైదరాబాదులో జీరో FIR వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని జీరో FIR చేసిన ఎస్సై సతీమణి శ్రీరాముల కృష్ణవేణి హైదరాబాద్
మలక్ పెట్ లో జీరో ఫైర్ నమోదు చేయించారు. బాధితుడు భార్య ఫిర్యాదు ను పరిగణలోకి తీసుకున్న అక్కడి పోలీసులు మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ కి ఎస్సీ ఎస్టీ 2015 యాక్ట్ ఇతర యాక్ట్ లు పొందపరచి కేసును ట్రాన్స్ఫర్ చేశారు. కాగా ఎస్సై రెండు ఫోన్లు వన్ ప్లస్, సామ్సంగ్ సంబంధిత అధికారుల ఆధీనంలో ఉన్నాయని వాటిలో ఉన్న సమాచారాన్ని భద్రపరిచి ఇవ్వాలని దరఖాస్తులో కోరారు. అదే విధంగా సివిల్ తగాదాలపై కేసులు నమోదు చేయాలని ఆయన మీద సీఐ అతని అనుచర సిబ్బంది ఒత్తిడి తెచ్చారని జీరో దరఖాస్తు లో పేర్కొన్నారు. దరఖాస్తు స్వీకరించిన పోలీసు అధికారులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు, ఇతర సెక్షన్లను జోడించి కేసును విచారించనున్నారు.