నేటి గదర్ న్యూస్ ,జులై 5 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు)
ఉద్యాన పంటలి సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ ద్వారా రాయితీ ఇవ్వబడుతుందనీ ఉద్యాన పాలేరు డివిజన్ అధికారి బి అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాయితీలు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ..మామిడి, నిమ్మ, బొప్పాయి,జామ కమలం ఫలం (డ్రాగన్ ఫ్రూట్ )సీతఫలం అరటి సాగు కు సాగు లో 40% రాయితీ ఇవ్వబడుతుంది. అలాగే మిరప, కూరగాయలు పూల పంటలు మల్చింగ్ తో సాగు చేసే వారికి 2.5 ఎకరాలు కి రూ.16000/- రాయితీ .
అలాగే నీటి కుంట లకు (20*20*3 ఎం)
50% రాయితీ గా రూ. 75,000/- గా ఇవ్వబడుతుందిని తెలిపారు.
పూర్తి వివరాల కోసం 8977714104 నంబర్ సంప్రదించగలరని తెలిపారు.
Post Views: 394