◆ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ సంఘం కో.ఆర్డినేటర్ గుగులోత్ సురేష్ నాయక్.
నేటి గదర్ న్యూస్ , జులై 5(పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
కాకతీయ యూనివర్సిటీలో గురువారం నియమించిన పాలక మండలిని రద్దు చేయాలని ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ సంఘం కో ఆర్డినేటర్ గుగులోత్ సురేష్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యున్నతమైన విశ్వవిద్యాలయంగా కాకతీయ యూనివర్సిటీకీ ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, ఇటువంటి కాకతీయ యూనివర్సిటీలో గురువారం నియమించిన పాలక మండలి సభ్యులలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సభ్యులకు చోటు కల్పించకపోవడం ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులుగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యమనీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 370కు పైగా ఉన్నత కళాశాలలు ఉన్నాయని సంవత్సరానికి 48 వేల విద్యార్థులు ఉన్నత చదువును కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఖమ్మం జిల్లాలో చదువుతున్నారని, నిన్న నియమించిన కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యులలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరినీ కూడా పాలక మండలి సభ్యులుగా నీయమించలేదనీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,తుమ్మల నాగేశ్వరావు ఉన్నారనీ, వారిని సంప్రదించకుండా ఉన్నత విద్యా కమిటీ అత్యుత్సాహం కనబరిచిందని, తక్షణమే ఖమ్మం జిల్లా నుంచి కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి లో ప్రాతినిధ్యం వహించే విధంగా ఇద్దరు సభ్యులను నియమించాలని, పాలకమండలి నియామకంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్తామని, నిన్న నియమించిన కమిటీ సభ్యులు అందరూ వరంగల్ జిల్లాకు చెందినవారై ఉన్నారనీ, విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ తత్వాన్ని ప్రోత్సహిస్తున్న ఉన్నత విద్యాధికారులపై చర్యలు తీసుకోవాలనీ రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లను కోరారు.