ఎంపిడిఓ వేణుగోపాల్ రెడ్డి..
నేటి గదర్ న్యూస్ , జులై 5 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఎంపిడిఓ వేణుగోపాల్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం శుక్రవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపిడిఓ బి.వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల స్థాయి ప్రభుత్వ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. వర్షాకాల సీజన్ జూలై, ఆగస్టు,సెప్టెంబర్ నెలలో వచ్చే బారి వర్షాల వలన జరుగు ప్రమాదాలు, సీజనల్ వ్యాధులు,డెంగ్యూ,చికెన్ గున్యా,మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా,ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అలాగే
ఈ సమావేశంలో భారీ వర్షాల వలన సంభవించే ప్రమాదాలకు, సీజనల్ వ్యాధులు, సురక్షితమైన త్రాగు నీరు అందించుటపై సంబంధిత అధికారులకు,పంచాయితీ కార్యదర్శులకు సలహాలు సూచనలు తీసుకొని యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు తహసిల్దార్ సురేష్ కుమార్ , మండల వ్యవసాయ అధికారి వాణి,మండల వైద్య అధికారి కిషోర్, మండల వెటర్నరీ అధికారి నీలకాంత్, పంచాయితీ ఏఈ కిషోర్, ఆర్డబ్ల్యూసీఐ రంజిత్ కుమార్, ఆర్ అండ్ బి ఏఈ దేవేందర్, ఐబీ ఏఈ, విద్యుత్ శాఖ ఏఈ, ఐసిడిఎస్ సూపర్ వైజర్స్,పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.