★ అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
★ఐఎఫ్టియు డిమాండ్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదులాపురం గోపాలరావు లు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ గకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఐఎఫ్టియు నాయకులు మాట్లాడుతూ
గ్రామపంచాయతీ కార్మికుల జీతాలను నెలలు తరబడిగా చెల్లించకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని,
అసలే చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న కార్మికులకు జీతాలు సకాలంలో రాకపోవడంతో అర్దాకలితో అలమటిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు పిఆర్సి నివేదికను అమలు చేయకుండా వారి పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించారని,
టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు కార్మికులు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. నేడు
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కార్మికుల జీతాలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. 2021 పి ఆర్ సి నివేదిక ప్రకారం 30% ఫిట్మెంట్తో గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలని, పిఆర్సి జీవో 60 ప్రకారం మేడే కానుక కలుపుకొని వేతనాలను అమలు చేయాలని కోరారు
నైపుణ్యం లేని పనికి 16600 అర్థ నైపుణ్యం పనికి 20,500 నైపుణ్యం గల కార్మికులకు 23,750 రూపాయల వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు
2011 జనాభా లెక్కల ప్రాతిపదిక కాకుండా నేడు పెరుగుతున్న జనాభా అనుగునంగా గ్రామపంచాయతీలలో కార్మికులను నియమించి పని భారం తగ్గించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు మల్సూర్, నీలం భాస్కర్, కొండ చరణ్, ముత్తయ్య ,భాను బాలరాజు తదితరులు పాల్గొన్నారు.