నేటి గద్దర్ న్యూస్, వెంకటాపురం :
మండలం తిప్పాపురం గ్రామం లో సిఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.అపరిచిత, అనుమానిత వ్యక్తులు గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తే పోలీసువారికి సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు.రాబోయే వర్షాలకు వాగులు ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున ఆ సమయంలో ఎవరు చేపల వేటకు, ఈతకు వెళ్లకూడదని వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ వెంకటాపురం కే తిరుపతి రావు, సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ఓభయ్యా, స్పెషల్ పార్టీ సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 128