★మండల వ్యాప్తంగా ప్రధాన కూడలిలో వెలసిన మావోయిస్టు వాల్ పోస్టర్లు.
★గ్రామాలలో అనుమానిత,కొత్త వ్యక్తుల సంచారం ఉంటే సమాచారం ఇవ్వండి: ఎస్ఐ ఎ.రాజేందర్
నేటి గద్దర్ కరకగూడెం:
మండల వ్యాప్తంగా గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని గ్రామలలో ప్రధాన కూడలిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాలు పోస్టర్లు అంటించారు.అమాయకుల ప్రాణాలు ఎన్ని తీసుకుంటారు అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మావోయిస్టులను గ్రామలలోకి రానియొద్దు అని కరకగూడెం ఎస్ఐ ఎ.రాజేందర్ అన్నారు. రాత్రి సమయంలో గ్రామాలలో వాలు పోస్టర్లు వెలవడంతో గ్రామలలో విస్తృతంగా చర్చ జరుగుతుందని అన్నారు. దీనిపై పోలిస్ శాఖ అయ గ్రామలలో అరా తిస్తున్నారని తెలిపారు. అలాగే ఎవ్వరైన కొత్త వ్యక్తులు, అనుమానితులు అనపడుతే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. కాలం చెల్లిన సిద్దాంతలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మావోయిస్టులను ప్రజలు దూరం పెట్టాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని అయన అన్నారు.