నేటి గద్దర్ హుకుంపేట న్యూస్:
అల్లూరి జిల్లా హుకుంపేట,ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఉత్తర్వుల మేరకు 2024-25 విద్య సంవత్సరంనకు హుకుంపేట మండలంలో గల, ప్రభుత్వ గిరిజనసంక్షేమ పాఠశాలలో వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో విద్యపై అవగాహన ఏర్పాటు చేశారు,చట్టాలు హక్కులు పరిరక్షణ కోసం 8,9 తగతుల విద్యార్థులతో వినియోగదారుల క్లబ్బులు ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయులు, క్లబ్ ఇన్చార్జిలు ఎల్, లోహితస్యుడు, పి. వెంకట్ రావుతో పాటు సిబ్బంది బాలకృష్ణ, శ్యాంసుందర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు బూడిదే చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి రమేష్ కిముడు, జాయింట్ సెక్రటరీ ఒలిబిరి బాలరాజు, పాఠశాల వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా పొట్నూరి సంధ్య, ఉబ్బేటి దీపక్, ప్రధాన కార్యదర్షులుగా జెమ్మెలి హరి, కొర్ర సంతోష్,సయుక్తంగా ఎన్నికైనారనితెలిపారు.